Satyanveshana    Chapters   

గ్రంథకర్త

ఆర్షేయపౌరషేయములకు పేరుగాంచిన విన్నకోట సద్వంశజుడు. జననం 1897. పట్టభద్రుడు. విద్యాశాఖ యందు ఉపాధ్యాయుడుగా సహాయపరీక్షాశాఖాధికారిగ కళాశాల అధ్యాపకుడుగా సుమారు నలుబది సంవత్సరములు పనిచేసి విశ్రాంతి పుచ్చుకొనినారు. కుటుంబ గౌరవమును నిలబెట్టుటయందు పట్టుదలగలవారు. ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరము కలవారు. స్నేహపాత్రులు, లలితకళాభిమాని. నటుడు. కళాప్రబోధ ఔత్సాహిక నాటక సంస్థ స్థాపకుడు, అధినేత, దర్శకుడు, వ్యాయామ క్రీడాకుశలి, కవిసార్వతేయుడు గ్రంధకర్త, విమర్శకుడు, ఆంధ్ర నలంద స్థాపక కార్యవర్గ కార్యదర్శి, రసోదయ అధినేత, శ్రీ శివశంకరస్వామి దత్త విమర్శకావతంస, కుర్తాళం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి ప్రసాదిత కావ్యతత్త్వ విశారద ఇత్యాది బిరుదు శోభితుడు, సుజన విధేయుడు, మానవసేవాభిలాషి.

Satyanveshana    Chapters